మద్దుకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
ఆటోను ఢీకొట్టిన లారీ; ఇద్దరు యువకులు మృతి
✍🏽 దివిటీ మీడియా – అన్నపురెడ్డిపల్లి
అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలో మద్దుకూరు సమీపంలోని గుట్ట ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం… భద్రాచలం వైపు జామాయిల్ కర్రలోడుతో వెళ్తున్న ఓ లారీ, ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణం చేస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు ప్రయాణిస్తున్న ఆటో జూలూరుపాడు రామాలయం ప్రాంతానికి చెందిన వ్యక్తులదిగా సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అన్నపురెడ్డిపల్లి ఎస్సై సయ్యద్ షాహినా సంఘటన స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.