Divitimedia
Bhadradri KothagudemEducationTelanganaYouth

వైద్య విద్యలో పేరు ప్రఖ్యాతులు సాధించాలి

వైద్య విద్యలో పేరు ప్రఖ్యాతులు సాధించాలి

ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులతో కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

వైద్యవిద్యలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి జిల్లాకు, తద్వారా మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు సాధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక వైద్య విద్యార్ధులకు ఉద్భోధించారు. ఆమె శుక్రవారం కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్యవిద్యాభ్యాసాన్ని ఎంచుకోవడం పట్ల విద్యార్థులను అభినందించారు. పట్టుదల, ఇష్టంతో చదివి ఉన్నతశిఖరాలకు చేరుకుని ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. విద్యార్థులు డిసెక్షన్ చేస్తున్న అనాటమీ ల్యాబ్ పరిశీలించారు. కళాశాల పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండాలని, ఖాళీస్థలంలో విరివిగా చెట్లు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కళాశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల హాజరుపై కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణరావును వివరాలడిగి తెలుసుకున్నారు. కళాశాలలో మొత్తం 150సీట్లుండగా, గత సంవత్సరం నుంచి కళాశాల ప్రారంభమైందని, మొత్తం 149 మంది విద్యార్థులు చేరినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థుల్లో బాలురు 62మంది బాలికలు 87మంది ఉన్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం మొదటి సంవత్సరంలో 107మంది విద్యార్థులకు మొదటి విడతలో సీట్ల కేటాయింపు జరిగినట్లు వెల్లడించారు. అడ్మిషన్లు జరుగుతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపల్ కు ఆమె సూచించారు. అనంతరం వైద్య కళాశాల నిర్మాణ పనుల పురోగతిపై ఆర్ అండ్ బి ఈఈ భీమ్లాను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, నాణ్యతప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యార్థులతో కలెక్టర్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణరావు, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఐ.అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోకాళ్ల వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి డిఇ మురళి, స్థానిక తహసిల్దార్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీతారామ ప్రాజెక్టు నీరు ఈ ప్రాంతానికి కూడా ఇవ్వాలి

Divitimedia

వరదల్లో ప్రాణరక్షణ కోసం అగ్రికల్చర్ డ్రోన్లు

Divitimedia

నర్సరీ ఆధునీకరణ ప్రణాళికలకు ఐటీడీఏ పీఓ ఆదేశాలు

Divitimedia

Leave a Comment