Divitimedia
Bhadradri KothagudemLife StyleTelangana

భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో స్థానిక ప్రగతిమైదానంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వవిప్ రేగా కాంతారావు జెండా ఆవిష్కరించారు. జిల్లాకలెక్టర్ డా.ప్రియాంక, ఎస్పీ డా.వినీత్, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు, కళాకారుల చేత ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమసేవలు అందించిన సిబ్బంది, అధికారులకు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరపున ప్రసంశాపత్రాల పంపిణీ చేశారు. ప్రభుత్వం జిల్లాలో వివిధ పథకాల కింద మంజూరు చేసిన యూనిట్లను కూడా సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమాచార, పౌరసంబంధాల శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు, అహూతులు ఈ కార్యక్రమంలో పరిశీలించారు. ఉంటుందని వివరించారు. పోలీస్ పరేడ్, గౌరవవందనం నిర్వహించారు. కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్, జిల్లాలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో సంబంధిత అధికారులు జాతీయ పతాకం ఆవిష్కరించారు. జిల్లాలో వాడవాడలా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జాతీయపతాకం రెపరెపలాడుతూ దేశంలో జాతీయ భావాన్ని, ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలను చాటి చెప్పింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వేడుకగా ఐటీసీ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్‌భద్రా ఇన్‌స్టాలేషన్

Divitimedia

ఉత్సాహంగా దివ్యాంగుల జిల్లాస్థాయి ఆటల పోటీలు

Divitimedia

నేతల మెడలకు చుట్టుకుంటున్న ‘మద్యం’ పాలసీలు

Divitimedia

Leave a Comment