Divitimedia
Bhadradri KothagudemFarmingHealthLife StyleSpot NewsTechnologyTelangana

శిక్షణ పొందిన పశువైద్యాధికారులతో కలెక్టర్ సమావేశం

శిక్షణ పొందిన పశువైద్యాధికారులతో కలెక్టర్ సమావేశం

జిల్లాలో మేకజాతుల అభివృద్ధి ప్రణాళికలపై చర్చ

✍️ దివిటీ (కొత్తగూడెం) ఆగస్టు 30

మేకల పెంపకం, ఉత్పత్తులపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మధుర సమీప మక్దూంలో ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ గోట్స్ (సి.ఐ.ఆర్.జి)’లో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పశువైద్యాధికారులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి పాటిల్ శనివారం సమావేశమయ్యారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, మేకలపెంపకం, మేకపాలు, ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందిన ప్రాథమిక పశువైద్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ జి.ఆనందరావు (రామవరం), డాక్టర్ సిహెచ్.బాలకృష్ణ (సారపాక), డాక్టర్ వి.సంతోష్ (చండ్రుగొండ) పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో శాస్త్రీయ పద్ధతిలో మేకల పెంపకం, స్థానిక మేకజాతుల అభివృద్ధి, కృత్రిమ గర్భధారణ, మెరుగైన విత్తనపు పోతుల లభ్యత, పశుగ్రాసరకాలు-దాణా మిశ్రమపదార్థాల లభ్యత, మేకల పెంపక విధానాల్లో సమయానుకూల ఆరోగ్య పరిరక్షణ చర్యలు, తదితర అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణప్రాంతాల్లో మేకల పెంపకందారులకు అవగాహన కల్పన, మేకలషెడ్డు నిర్వహణ, పశుగ్రాసఉత్పత్తి, అధిక మాంసకృతులు కలిగిన ఆహారం అందించడం, స్థానిక మేకజాతుల జన్యు అభివృద్ధి వంటి అంశాలపై చేపట్టనున్న చర్యలపై చర్చించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఒక్కొక్క గ్రామం నుంచి ఇద్దరు ఔత్సాహిక పశుపోషక రైతుల ద్వారా అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి తదుపరి సమావేశానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

Related posts

సీఎం రేవంత్ ను ‘అలయ్ బలయ్’కు ఆహ్వానించిన ‘దత్తన్న’…

Divitimedia

“అన్నపు చొరవే గాని… అక్షరపు చొరవ లేదు…”

Divitimedia

మణుగూరులో పొలిటికల్ హీట్ ; హోర్డింగుల ధ్వంసం వివాదం

Divitimedia

Leave a Comment