సీఎంను కలిసిన ముస్లిం ప్రజాప్రతినిధులు
✍️ దివిటీ (హైదరాబాద్) ఆగస్టు 29
తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డిని శుక్రవారం ముస్లిం ప్రజాప్రతినిధులు కలిశారు. సీఎంను కలిసిన వారిలో హైదరాబాద్ లోక్‌సభసభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీతో పాటు మార్కజ్ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులున్నారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పురాతన మసీదులు, దర్గాలను అలంకరించాలని, వాటికి ఉచిత విద్యుత్ సరఫరా అందించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా సెప్టెంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా వారు కోరారు.