23న బయోకాన్ కంపెనీలో అప్రెంటిస్ ఉద్యోగాలకు జాబ్ మేళా
✍️ భద్రాచలం – దివిటీ (ఆగస్టు 18)
భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు హైదరాబాద్ లో ప్రైవేటు రంగ సంస్థ బయోకాన్ లో అప్రెంటీస్ గా ఉద్యోగావకాశాలు కల్పించే నిమిత్తం ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా (కెమికల్), బీటెక్(కెమికల్) చదివిన 2024, 2025 బ్యాచ్ ప్రెషర్లు ఈ ఎంపికకు అర్హులని వెల్లడించారు. ఒక సంవత్సరకాలం అప్రెంటిస్ శిక్షణకుగాను నెలకు రూ.10,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.
ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువత తమ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల దృవీకరణ జిరాక్స్ సర్టిఫికెట్లతో 23వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న ‘యూత్ ట్రైనింగ్ సెంటర్’లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆయన కోరారు. ఇంకా పూర్తి సమాచారం కోసం 9063839994, 6302608905 సెల్ ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.