ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్
చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 14)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత అధికారులు ఆ దరఖాస్తులు పరిశీలించి తగు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ వారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన పలువురు ‘తమ సమస్యలు వినేందుకు స్వయంగా కలెక్టర్ అందుబాటులో ఉండి ఉంటే బాగుండేదని’ అభిప్రాయపడ్డారు.