Divitimedia
Bhadradri KothagudemBusinessHealthLife StyleSpot NewsTelanganaWomen

ఎస్.హెచ్.జి. సభ్యులకు ఇన్సూరెన్స్ నమోదు

ఎస్.హెచ్.జి. సభ్యులకు ఇన్సూరెన్స్ నమోదు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జూన్ 27)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సురెన్స్ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. డీఆర్డీఓ విద్యాచందన, ఎస్బీఐ ఎల్డీఎం రామిరెడ్డి సమక్షంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలుత డీఆర్డీఓ స్వయంగా పీఎం సురక్ష బీమా యోజనలో పాలసీని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకుని కార్యక్రమం ప్రారంభించారు. చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్, పాల్వంచ, టేకులపల్లి మండలాల నుంచి స్వయం సహాయక సంఘ సభ్యులు వీఓఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలలో ఉన్న ప్రతి మహిళ, వారి కుటుంబ సభ్యులు ఈ బీమా నమోదు చేసుకోవాలని సూచించారు, పాలసీల వివరాలను ఎల్డీఎం వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)లో ఏడాదికి రూ.20 ప్రీమియం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)లో ఏడాదికి రూ.436 ను స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధార్, వ్యక్తిగత బ్యాంకు పాసుపుస్తకం నమోదు చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, ఎల్డీఎం రామిరెడ్డితోపాటు సెర్ప్ ఏడీఆర్డీఓ బి.నీలేష్, ఈడీఎం సైదేష్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, డీపీఎంలు, ఏపీఎంలు, 5 మండలాల సీసీలు, వీఓఏలు(గ్రామ దీపికలు), గ్రామ సమాఖ్యల ప్రతినిధులు, ఎఫ్ఏలు పాల్గొన్నారు.

Related posts

మార్చి 19లోగా రాజకీయ పార్టీలతో సమావేశాలు పూర్తిచేయాలి

Divitimedia

ఉద్యోగాల పేరుతో రూ.4కోట్లకు పైగా వసూళ్లు

Divitimedia

ముంపు బాధిత గ్రామాలను కాపాడాలని ధర్నా

Divitimedia

Leave a Comment