Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelanganaYouth

ఉగ్రవాదానికి సరైన జవాబిచ్చే హక్కు వినియోగించుకున్న భారత్

ఉగ్రవాదానికి సరైన జవాబిచ్చే హక్కు వినియోగించుకున్న భారత్

సైనికులకు కృతజ్ఞతలు తెలిపిన విజయ్ కుమార్

✍️ కొత్తగూడెం – దివిటీ (మే 10)

“ఆపరేషన్ సింధూర్” విజయవంతంగా అమలుచేసి శత్రుస్థావరాలను విచ్చిన్నం చేసినందుకు ప్రధాని మోదీకి, సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జాతీయ మానవహక్కుల కమిటీ (ఎన్.హెచ్.ఆర్.సి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మారెళ్లి విజయ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ పరేషాన్ అవుతోందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశానికైనా ఇది గుణపాఠం కావాలన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన భారతీయులకు నిజమైన నివాళులర్పించినట్లయిందన్నారు. అనుకున్నట్లే ఉగ్రవాద మూకలకు గుణపాఠం చెప్పిన భారత సైన్యాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, వారికి భగవంతుడు మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. యుద్ధభూమిలో ఒరిగిన మురళీనాయక్ రక్తం, భరతమాత నుదిటిన అద్దిన సింధూరంలా యుద్ధంలో జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందడం బాధాకరమని పేర్కొన్నారు. భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Related posts

ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి

Divitimedia

విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన శిక్షణ ఐఏఎస్ అధికారి

Divitimedia

లక్ష్మీపురంలో 11న సీఎం రేవంత్ రెడ్డి సభ ఖరారు

Divitimedia

Leave a Comment