బూర్గంపాడులో 29న “భూభారతి” అవగాహన సదస్సు
✍️ బూర్గంపాడు – దివిటీ (ఏప్రిల్ 28)
బూర్గంపాడు మండల రైతు సోదరులకు ‘భూభారతి చట్టం-2025’ పై అవగాహన కల్పించేందుకు మంగళవారం మండల కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నట్లు
తహసీల్దారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ఈ సదస్సులో నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారం, భూహక్కుల భద్రత, భరోసా కోసం ఇటీవలే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలు చేస్తున్న నూతన ఆర్ఓఆర్ చట్టం(భూభారతి-2025) విధి విధానాలు, భూభారతి పోర్టల్ గురించిన
అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సదస్సు స్థానిక రైతువేదికలో జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి బూర్గంపాడు మండల రైతులు, రైతుసంఘ, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ బాధ్యులు, పుర ప్రముఖులు, మహిళా సమాఖ్య, ప్రజలు, పాత్రికేయులు హాజరు కావాలని ఆయన కోరారు.