నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
✍️ అమరావతి – దివిటీ (ఏప్రిల్ 12)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శనివారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్ ఫలితాలు resultsbie.ap.gov.inలో చూడవచ్చని, మనమిత్ర నెంబర్. 9552300009కు ‘Hi’ సందేశం పంపి ఫలితాలు తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ వివరించారు.