ఏపీలో 13 కొత్త జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు
సోషల్ వర్కర్స్ నుంచి దరఖాస్తులు కోరిన ప్రభుత్వం
✍️ అమరావతి – దివిటీ (మార్చి 30)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటుచేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీల్లో ఛైర్ పర్సన్లు, మెంబర్లు, జువైనల్ జస్టిస్ బోర్డుల్లో (బాలలన్యాయ మండళ్లలో) సోషల్ వర్కర్ మెంబర్లుగా సేవలందించేందుకు అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు బాలల సంక్షేమం, సంస్కరణలు, సేవలు, వీధిబాలల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుడు ఎం.వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశిత ఫార్మాట్ లో, అర్హత దృవీకరణ పత్రాల నకళ్లతో పాటు ఏప్రిల్ 9వ తేదీ లోపు విజయవాడలోని ఆ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపాలని కోరారు. విద్యార్హతలు, అనుభవం, ఎంపిక విధానం, తదితర వివరాలకు సంబంధిత వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ గానీ, రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ మాత్రమే పంపాలని, ఇమెయిల్స్ ద్వారా పంపిన దరఖాస్తులు, అసంపూర్తి దరఖాస్తులు అంగీకరింపబడవన్నారు.
దరఖాస్తుల ఫార్మాట్, నోటిఫికేషన్ కోసం చూడాల్సిన వెబ్ సైట్ : https://wdcw.ap.gov.in.
దరఖాస్తులు ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5-30 గంటల లోపు పంపించాల్సిన చిరునామా :
The Director, Dept. of Juvenile Welfare, Correctional Services & Welfare of Street Children,
D.No.3-1-265/4A,
Govt. Observation Home for Boys premises,
Near Kabela Centre, Rotary Nagar,
Vidyadharapuram, Vijayawada – 520012, NTR Dist., A.P