Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelanganaYouth

సీపీఎం ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94 వర్ధంతి

సీపీఎం ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94 వర్ధంతి

✍️ సారపాక – దివిటీ (మార్చి 23)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బస్టాండ్ సెంటర్లో ఆదివారం భగత్ సింగ్ 94వ వర్థంతిని నిర్వహించారు. కార్యక్రమంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గొప్ప దేశభక్తులని కొనియాడారు. కుల మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజల్ని కూడగట్టి బ్రిటిష్ వాళ్ల పైన దండయాత్ర చేసిన గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ ఆశయాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజని, భయ్యా రాము, పాండవుల రామనాథం, SK అబీదా, నాగమణి, ధర్మా, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Divitimedia

నవంబరు 10న ఉమ్మడి జిల్లా పాఠశాలల బాక్సింగ్, సాఫ్ట్ బాల్ ఎంపికలు

Divitimedia

‘బీఆర్ఎస్’ కు కొత్త అర్థం చెప్పిన రాహుల్ గాంధీ…

Diviti Media News

Leave a Comment