Divitimedia
HyderabadLife StyleMahabubabadPoliticsSpot NewsTelangana

కాంగ్రెస్ పార్టీ లీడర్ రివ్యూకు హాజరైన అధికారులు?

కాంగ్రెస్ పార్టీ లీడర్ రివ్యూకు హాజరైన అధికారులు?

ముక్కున వేలేసుకుంటున్న జనం…

✍️ మహబూబాబాద్ – దివిటీ (మార్చి 10)

ప్రభుత్వానికి, అధికారపార్టీకి మధ్య చిన్న విభజనరేఖ ఉంటుందన్న విషయం మరిచిపోతున్న కొందరు నాయకులు అధికారులపై కూడా నేరుగానే పెత్తనం చేస్తున్నారు. వారిని అదుపు చేయాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు అధికారిక పాలప అందని దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిఫలాలు అర్హులకు అందకుండా పక్షపాతం, అవినీతికి దారి తీసే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ దుస్థితికి అద్దంపట్టేలా మహబూబాబాద్ జిల్లా మరిపెడ అతిథిగృహంలో అధికార పార్టీ మండల అధ్యక్షుడు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. అధికారికహోదా లేని లీడర్ అధికారులపై పెత్తనం చేస్తూ మీటింగ్ పెట్టడమేంటని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు ఈ విషయంపై అవగాహనలేదనుకున్నా కనీసం అధికారులకైనా ఉండాలి కదా? అని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. బాధ్యత కలిగిన అధికారులు ఇలాంటి వాటికి ఎలా అవకాశం ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆ జిల్లా కలెక్టర్ దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజల నుంచి వస్తున్న డిమాండ్…

Related posts

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Divitimedia

ఐటీసీలో కార్మికసంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

Divitimedia

భారీవర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :

Divitimedia

Leave a Comment