Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelangana

మోరంపల్లిబంజరకు నూతన సి.హెచ్.సి మంజూరు

మోరంపల్లిబంజరకు నూతన సి.హెచ్.సి మంజూరు

స్థలపరిశీలన చేసిన జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్

✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 10)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర్ లో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి) మంజూరైంది. ఈ మేరకు సి.హెచ్.సి నిర్మాణానికి అవసరమైన స్థలం మండల అధికారులు ఎంపిక చేయగా, ఆ స్థలాన్ని సోమవారం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ స్వయంగా పరిశీలించారు. వేపలగడ్డ బస్టాండ్ సమీపంలో అధికారులు ఎంపిక చేసిన నాలుగు ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం ఎంపిక చేసిన ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆయన మండల అధికారులను ఆదేశించారు. పరిశీలన కార్యక్రమంలో బూర్గంపాడు డిప్యూటీ తహసిల్దార్ రాంనరేష్, పలువురు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు పంపిణీ చేసిన ఎస్పీ

Divitimedia

23న బయోకాన్ కంపెనీలో అప్రెంటిస్ ఉద్యోగాలకు జాబ్ మేళా

Divitimedia

తనభర్తతో చనువుగా ఉంటోందని మహిళను నరికిన భార్య

Divitimedia

Leave a Comment