పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ షర్మిలారెడ్డి ఘాటు విమర్శలు
✍️ అమరావతి – దివిటీ (మార్చి 5)
పోలవరం ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ లపై ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ‘ఎక్స్’ వేదికగా ఆమె గత, ప్రస్తుత ప్రభుత్వాలపై చేసిన విమర్శలు ఆమె మాటల్లోనే…
- పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి పచ్చి అబద్ధాలు.
- మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజాలను దాచి పెడుతున్నారు.
- రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టులో జీవం తీసేశారు.
- ఎత్తు తగ్గించి 194 TMCల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 TMCలకు పరిమితం చేశారు.
- ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు.
- 22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ..
- సాగునీరు అందించే మహానేత YSR నిర్ధేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారు.
- 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని YSR అనుకుంటే..
- 41.15 మీటర్ల ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్‌గా మార్చుతున్నారు.
- నీటి నిల్వకు తప్పా ఎందుకు పనికి రాని ప్రాజెక్టుగా చేస్తున్నారు.
- 41.15 మీటర్ల ఎత్తుకి, రూ.30,436 కోట్ల బడ్జెట్ అంచనాలను కేంద్రం ఆమోద ముద్ర వేస్తే..
- 45.72 మీటర్ల ఎత్తులో కట్టి తీరుతాం అని అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి అవాస్తవాలు కావా ?
- కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
- పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అయితే, ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే,
- కేంద్ర ప్రభుత్వంతో వెంటనే అధికారిక ప్రకటన చేయించండి.
- తక్షణమే ప్రాజెక్టు కొత్త DPR బయటపెట్టండి.
- అఖిలపక్షాన్ని పిలిచి నిజానిజాలు చెప్పండి.
- పునరావాస చర్యలకే రూ.30వేల కోట్లు దాటుతుంటే, తీసుకుంటున్న చర్యలు ఏంటో వివరించండి.
- ఇక పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతికత YCP పార్టీకి లేదు.
- స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉచ్చరించే హక్కు లేనే లేదు.
- పోలవరం ప్రాజెక్టు పేరు వింటే YSR గుర్తుకు వచ్చే మీకు..
- 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా ? YSR జీవిత ఆశయం పోలవరం అని మీకు తెలియదా ?
- అధికారంలో ఉండగా తట్టెడు మట్టి అయినా తీశారా ?
- ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా ?
- నాడు ప్రధానికి రాసిన లేఖల్లోనూ 41.15 మీటర్ల మేరకు నిధులు విడుదల చేయాలని అడగలేదా ?
- వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి మీ అనాలోచిత నిర్ణయాలే కారణం అని ..
- పోలవరం అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ?
- రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు.
- కుడి, ఎడుమ కాలువల సామర్థ్యాన్ని తగ్గించి మహానేత ఆశయాలకు తూట్లు పొడిచారు.
- పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయితే,
- కర్త, కర్మ,క్రియ జగన్ మోహన్ రెడ్డి గారే.