Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaYouth

ప్రణాళిక ప్రకారం భవిష్యత్తు నిర్మించుకోవాలి

ప్రణాళిక ప్రకారం భవిష్యత్తు నిర్మించుకోవాలి

‘కెరీర్ గైడెన్స్’ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ

✍️ పాల్వంచ – దివిటీ (మార్చి 4)

గిరిజన బాలబాలికలు తమ జీవితంలో అత్యున్నత స్థానంలో నిలబడటానికి, తామనుకున్న గోల్ సాధించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికతో మందుకు సాగాలని ట్రైబల్ వెల్ఫేర్ డీడీ (డెప్యూటీ డైరెక్టర్) మణెమ్మ సూచించారు. ట్రైబల్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో ఈ మేరకు మంగళవారం పాల్వంచ మండలంలోని ఉల్వనూరు ఏజీహెచ్ఎస్ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8, 9, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఏర్పాటు చేసిన కెరీర్ గైడెన్స్ (అవగాహన సదస్సు)లో ఆమె మాట్లాడారు. ప్రేరణతో కెరిర్ గైడెన్స్ ద్వారా అవగాహనకోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పదవ తరగతి విద్యార్థినులే కాక 8, 9 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు పదో తరగతి అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారో, ఇప్పట్నుంచే కెరీర్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యా ఉద్యోగ సమాచారం పిల్లలందరూ తెలుసుకునే విధంగా పాఠశాలల్లో ఏర్పాటు చేశామన్నారు. ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారిలో అంతర్గతంగా దాగి ఉన్న టాలెంట్ ను గుర్తించి, వారు స్థిరపడాలనుకునే రంగంలో రాణించేలా సలహాలు సూచనలు ఇవ్వాలని డీడీ కోరారు. 10వ తరగతి పరీక్షల్లో పిల్లలు మంచి గ్రేడ్లలో పాసయ్యేలా సంబంధిత హెచ్ఎం, సబ్జెక్ట్ టీచర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలల్లో పెట్టిన చార్టులు చదివి వాటిలోని అంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని మనసులో ఒక గోల్ ఏర్పాటు చేసుకుని సామర్థ్యాలు పెంచుకోవాలన్నారు. కెరియర్ గైడెన్స్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ శాఖల్లో పనిచేసే అధికారులు భవిష్యత్తు గురించి సూచనలు చేశారు. విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో చదివిస్తున్నందన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ ఆశలు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీఈ, స్పెషలాఫీసర్ మధుకర్, తహసిల్దారు వివేక్, ఎంపీడీఓ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎంఈఓ శ్రీరామమూర్తి, అగ్రికల్చర్ ఆఫీసర్ శంభోశంకర్, మెడికల్ ఆఫీసర్ తేజశ్రీ, డీఈఈ సుధా, ఎస్సై సురేష్, పలు శాఖల సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.

Related posts

నేడు జిల్లాకు రానున్న ఎంపీ రఘురాంరెడ్డి

Divitimedia

ఇందిరమ్మ గృహం బిల్లులో మోసం…

Divitimedia

భద్రాద్రిలో గోదావరి స్నానఘట్టాలు పరిశీలించిన కలెక్టర్

Divitimedia

Leave a Comment