Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelangana

డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

✍️ కొత్తగూడెం – దివిటీ (జనవరి 12)

తెలంగాణ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా మాలోతు జగ్గుదాస్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక పోస్ట్ ఆఫీస్ సమీపంలో నూతన కార్యాలయంలో జరిగిన సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి లెనినా ముఖ్యఅతిధిగా హాజరై జిల్లా వ్యాప్తంగా దివ్యాంగ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. దివ్యాంగులు సమావేశాల కోసం తమకు భవనం లేక ఇబ్బందులు పడుతున్నామని టీవీపీఎస్ అధ్యక్షుడు సతీష్ గుండపనేని తన దృష్టికి తీసుకురాగా వెంటనే భవనాన్ని కేటాయించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దివ్యాంగులు చాలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, దివ్యాంగులు శారీరక లోపం ఉన్న వారు, మానసికంగా చాలా బలవంతులుగా ఉంటారని, శారీరక లోపాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యోగులుగా స్థిరపడడం గర్వకారణం అన్నారు. తాము ఉద్యోగులుగా ఉన్నప్పటికీ సమాజంలో కడు దీనస్థితిలో ఉన్న దివ్యాంగుల కోసం ఉద్యోగసంఘం పనిచేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగుల కోసం మంజూరు చేసిన నూతన భవనం ఆమె పరిశీలించి, ఇంకా ఏమైనా అవసరాలుంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే సమకూర్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు వాసిరెడ్డి దివ్యాంగుల సమస్యలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన గౌరవాధ్యక్షులు కొండలరావు, మీనాక్షి, జిల్లా అధ్యక్షుడు మాలోత్ జగ్గుదాస్, ప్రధాన కార్యదర్శి బానోతు లక్ష్మ, కార్యనిర్వాహక అధ్యక్షులు. గుండేటి రాము, యాకుబ్, హ్యాపీ హఫీసుద్దీన్, కోశాధికారి రమణయ్య,
మహిళా ప్రధాన కార్యదర్శి ఉపేంద్రమ్మ,
అసోసియేట్ ప్రెసిడెంట్ ఇస్లావత్ శంకర్, బానోతు గన్య, వరలక్ష్మి, కార్యదర్శులు వశ్యా, ఎమ్.ఖీర్య, కళాబాబురెడ్డి, గోపీచంద్, భద్రు, సాంస్కృతిక సారథి రేణుక, మహిళా కార్యదర్శులు ఏ.ధనలక్ష్మి, మృదుల, సీతామాలక్ష్మి, వెంకటరమణ, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఆటలపోటీలు

Divitimedia

కలెక్టర్ ను కలిసిన ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ ఈఈ

Divitimedia

‘సబ్ స్టేషన్’ కు స్థలం త్వరగా చూడాలి

Divitimedia

Leave a Comment