Divitimedia
Bhadradri KothagudemBusinessLife StylePoliticsSpot NewsTelanganaWomen

పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

✍️ కరకగూడెం – దివిటీ (జనవరి 8)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామంలో రూ. 20లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన వెంకటాపురం గ్రామపంచాయతీ నూతన కార్యాలయం నూతనభవనాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తేవాలన్నారు. ఈ సందర్భంగా వెంకటాపురం గ్రామంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. కరకగూడెం మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.4 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో కరకగూడెం తహసిల్దార్ నాగప్రసాద్, ఎంపీడీఓ కుమార్, ఎంఈఓ మంజుల, ప్రభుత్వాధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Related posts

బూర్గంపాడులో మొక్కలు నాటిన అధికారులు

Divitimedia

మేడిగడ్డ లోపాలపై పూర్తి వివరాలందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Divitimedia

‘అక్రమ పెన్షన్లు రద్దు ; అర్హులకే మంజూరు’

Divitimedia

Leave a Comment