ఆశ్రమ పాఠశాలలకు 75 కంప్యూటర్లు
సరఫరాకు టెండర్లు పిలిచిన భద్రాచలం ఐటీడీఏ
✍️ భద్రాచలం – దివిటీ (జనవరి 1)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలకు 75 కంప్యూటర్లు కొనుగోలు చేయాలని భద్రాచలం ఐటీడీఏ నిర్ణయించింది. ఈ కంప్యూటర్ల కొనుగోళ్ల కోసం స్వల్పకాలిక టెండర్లు కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల సరఫరాదారులు షార్ట్ టెండర్ ఫామ్స్ భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిజన సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ విభాగం నుంచి తగిన రుసుము డిమాండ్ డ్రాఫ్ట్(డిడి)రూపంలో చెల్లించి పొందాలని ఆయన కోరారు. ఈ టెండర్ ఫారాలను జనవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని పీఓ సూచించారు. ఈ టెండర్ల ప్రక్రియ జనవరి 7వ తేదీ ఉదయం 11 గంటలకు ఐటీడీఏ కార్యాలయంలో టెండరుదారుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై పూర్తి వివరాలకోసం గిరిజన సంక్షేమశాఖ భద్రాచలం డెప్యూటీ డైరెక్టర్ కార్యాలయం ఫోన్ నెంబర్లు 9701315526, 9182861609 కు ఫోన్ చేసి తెలుసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ కోరారు.