ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత గౌరవం
‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ ప్రదానం
ప్రధానికి ఇది 20వ అంతర్జాతీయ గౌరవం
✍️ న్యూఢిల్లీ – దివిటీ (డిసెంబరు 22)
భారత ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ ప్రభుత్వ అత్యున్నతగౌరవం లభించింది. ఆ దేశాన్ని సందర్శించే అతిథులలో అతి ముఖ్యులకు ఇచ్చే ‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ మోదీకి ప్రదానం చేసి కువైట్ ప్రభుత్వం గౌరవించింది. ప్రధానికి నరేంద్ర మోదీకి ఇది 20వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. ‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ అనేది కువైట్ దేశపు అతిథికి ఇచ్చే అత్యున్నత గౌరవం (నైట్ హుడ్ ఆర్డర్). పరస్పర స్నేహానికి చిహ్నంగా ఆ ప్రభుత్వం ఇతర దేశాధినేతలు, విదేశీ సార్వభౌమాధికారులకు, విదేశీ రాజ కుటుంబాల సభ్యులకు ఈ గౌరవం ఇచ్చి సత్కరిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచంలో అగ్రరాజ్యాల అధినేతలుగా ఆ దేశాన్ని సందర్శించిన బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ వంటి అతి కొద్దిమంది విదేశీ నేతలు మాత్రమే ఈ గౌరవం పొందారు. తొలిసారిగా భారత ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కువైట్ దేశ ప్రభుత్వం ఇలా గౌరవించడం ‘భారతదేశ ప్రజలందరికీ దక్కిన సత్కారం’ ఇది అని పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.