ప్రభుత్వ పాఠశాలలో ‘తిధి భోజనం‘
✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 20)
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం హెచ్.ఎం, ఎంఈఓ డాక్టర్.ప్రభుదయాల్ ఆధ్వర్యంలో ‘తిధిభోజనం’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని సకల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులంతా కలిసి సహపంక్తి భోజనం చేశారు. పరబ్రహ్మస్వరూపంగా ఆరోగ్యం, శక్తిని ప్రసాదించే ఆహారం ప్రాముఖ్యతను తెలియజేసేలా, సమతుల్య ఆహారాన్ని అందించేలా ప్రతినెలా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హెచ్ఎం ప్రభుదయాల్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరాచారి పాల్గొని, పాఠశాల పనితీరు, నిర్వహణ తీరును అభినందించారు. అనంతరం కొత్తగూడెం మండలంలో మధ్యాహ్న భోజనపథకం నిర్వాహకులలో 26మంది పేద మహిళలను గుర్తించి వారికి నూతన వస్త్రాలను మండల విద్యాశాఖాధికారి ఎం.ప్రభుదయాల్ బహుకరించారు.