గిరిజన దర్బార్ కు హాజరుకావాలి : ఐటీడీఏ పీఓ
✍️ భద్రాచలం – దివిటీ (డిసెంబర్ 15)
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెల 16న నిర్వహించనున్న ‘గిరిజన దర్బార్’ కార్యక్రమానికి ఐటీడీఏలో అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని పీఓ బి.రాహుల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే గిరిజనులు తమ సమస్యల గురించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని పీఓ కోరారు. యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకే ఐటీడీఏ సమావేశమందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.