Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleTelanganaYouth

అర్బన్ రెసిడెన్షియల్ స్కూలుకు క్రీడా సామగ్రి అందజేత

అర్బన్ రెసిడెన్షియల్ స్కూలుకు క్రీడా సామగ్రి అందజేత

✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 14)

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఆనందఖని పాఠశాల ఆవరణలో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల కు శనివారం మండల విద్యాశాఖాధికారి డాక్టర్ ప్రభుదయాల్ క్రీడాసామాగ్రి అంద జేశారు. ఆయన ఈ సామగ్రి వితరణగా ఇచ్చారు. ప్రత్యేకంగా ప్రభుత్వంచే పాక్షిక అనాధ బాలురకోసం నిర్వహించబడే ఈ పాఠశాలపై జిల్లాకలెక్టర్ ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. తరచూ ఈ పాఠశాల పరిస్థితులు పరిశీలించాల్సిందిగా కలెక్టర్ ఎంఈఓను ఆదేశించారు. దీంతో అక్కడి విద్యార్థులకుండే అవసరాలు గుర్తించిన ఎంఈఓ, క్రీడాసామగ్రితో పాటు పేస్టులు, సబ్బులు, దుస్తులు అందించారు. వారిని చక్కగా చదువుకోవాలని ప్రభుదయాల్ ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు.

Related posts

వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ప్రత్యేక చర్యలు

Divitimedia

వలస ఆదివాసీలకు ప్రత్యేక చికిత్సలు

Divitimedia

ఎన్నికల సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఐటీడీఏ పీఓ

Divitimedia

Leave a Comment