ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ ను కలిసిన బూసిరెడ్డి
✍️ బూర్గంపాడు – దివిటీ (డిసెంబరు 13)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ పేపర్ పరిశ్రమ నూతన ‘యూనిట్ హెడ్’గా బాధ్యతలు స్వీకరించిన శైలేంద్ర సింగ్ ను రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్ 3150 మాజీ గవర్నర్, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి చైర్మన్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా శుక్రవారం కలిశారు. శైలేంద్ర సింగ్ కు అభినందనలు తెలిపిన శంకర్ రెడ్డి, ఆయనకు భద్రాచల శ్రీరాములవారి శాలువా కప్పి సన్మానించారు. ఆయన
నేతృత్వంలో ఐటీసీ పిఎస్పీడీ యూనిట్ మరింతగా అభివృద్ధి చెందాలని, కార్మిక శ్రేయస్సు ఇనుమడించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ పరిశ్రమ అభివృద్ధికోసం స్తానికులుగా తమవంతు సంపూర్ణ సహాయ సహకారాలు కంపెనీకి ఎల్లవేళలా అందిస్తామని డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలిపారు.