ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం డీఆర్డీఓ విద్యాచందన
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 10)
ప్రతి ఇంట్లో తప్పక మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, బహిరంగ మల, మూత్ర విసర్జన వల్ల సంభవించే అనేక రకాల వ్యాధుల నుంచి తప్పించుకోవాలని భద్రాద్రి కొత్త గూడెం డీఆర్డీఓ విద్యాచందన సూచించారు. ఈమేరకు
అంతర్జాతీయ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు నిర్వహించిన కార్యక్రమాల ముగింపుసభ మంగళవారం ఐడీఓసీలోని డీఆర్డీఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ విద్యాచందన మాట్లాడారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లాలో సామూహిక, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ పోటీల్లో గెలుపొందిన వారిని సన్మానించి, ఙ్ఞాపికలు బహుకరించారు. సామూహిక మరుగుదొడ్డి నిర్వహణ అంశంలో బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామంలో సంత సమీపంలోని మరుగుదొడ్ల నిర్వహణ కు గాను పంచాయతీ సెక్రెటరీ భవానీని సన్మానించారు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్వహణలో అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీలో కుంజా వినోద, బూర్గంపాడు మండలం, ముసలిమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో పెరుమాళ్ల శ్రీను, బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ గ్రామంలో గడ్డల ఇందిరా, మణుగూరు మండలం సమితిసింగారంలో మడకం లక్ష్మి, పాల్వంచ మండలం యానంబైలులో ముద్దంగుల దేవమ్మలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అడిషనల్ డీఆర్డీఓ రవి, తదితరులు పాల్గొన్నారు.