మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2కె రన్
ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ విద్యాచందన
✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 3)
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం 2కె రన్ నిర్వహించారు. ఈ రన్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యాచందన జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగూడెం పోస్టాఫీస్, అంబేద్కర్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ ఎంజీ రోడ్ వరకు నిర్వహించిన ఈ 2K రన్ లో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజనస్వామి, మున్సిపల్ అధికారులు సిబ్బంది, పోలీస్, రెవెన్యూ, విద్య, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితోపాటు పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. 2K రన్ లో ముందుగా గమ్యం చేరుకున్న ముగ్గురు బాలికలు, బాలురతోపాటు పాల్గొన్న అన్ని పాఠశాలలకు అడిషనల్ కలెక్టర్ విద్యాచందన చేతుల మీదుగా మెమొంటోలు అందించారు.