కిన్నెరసాని ప్రాంతం సందర్శించిన కలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 1)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని ఆదివారం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన
కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. టూరిజం, ఫారెస్ట్, కేటీపీఎస్ అధికారులకు ఆయన సూచనలు చేశారు. ఆ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వెదురుబొంగులతో కట్టడాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, ఫారెస్ట్, కేటీపీఎస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.