Divitimedia
Bhadradri KothagudemBusinessHyderabadLife StyleSpot NewsTelangana

జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

‘సీఎస్ఆర్’పై ఎమ్మెల్యేలు, పరిశ్రమల ప్రతినిధుతో కలెక్టర్ సమీక్ష

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 20)

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు నిధులందజేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ పారిశ్రామిక సంస్థలను కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు కలెక్టర్ బుధవారం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు,తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్యలతోపాటు పలు పరిశ్రమల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సామాజిక, విద్య, వైద్య రంగాలలో అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తామన్నారు. ఇక్కడున్న పారిశ్రామిక సంస్థలు జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు తమ వంతు బాధ్యతగా 2 శాతం అందజేయాలని ఆయన కోరారు. గతంలో సీఎస్ఆర్ నిధులతో అన్ని నియోజకవర్గాల్లో పరిధిలో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులు విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల ప్రకారం అవసరమైన పనులకు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ, బీటీపీఎస్ యాజమాన్యాల ఉన్నతాధికారులు, జీఎం ఇండస్ట్రీస్ తిరుపతయ్య, సీపీఓ సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

19 నుంచి గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు

Divitimedia

జిల్లాలో అధ్వానంగా నేషనల్ హైవే నిర్వహణ

Divitimedia

గృహలక్ష్మి పథకంలో అర్హులను మాత్రమే ఎంపిక చేయాలి

Divitimedia

Leave a Comment