పవర్ లిఫ్టింగ్ లో సత్తాచాటిన సిద్ధుసిద్ధార్థ
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
✍️ హైదరాబాద్ – దివిటీ (నవంబరు 19)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన సిద్ధాంతపు సిద్ధుసిద్ధార్థ పవర్ లిఫ్టింగ్ లో సత్తాచాటి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనుబంధ ‘స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ ఆసోసియేషన్, తెలంగాణ జోన్’ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఈ యువకుడు ప్రతిభ ప్రదర్శించి, 93 కిలోల విభాగంలో ప్రథమస్థానం సాధించాడు. ఈ నెల 17వ తేదీ రాత్రి జరిగిన ఈ పోటీలో 130 కిలోల డెడ్ లిఫ్ట్ సాధించాడు. భద్రాచలం పట్టణానికి చెందిన సిద్ధాంతపు శ్రీనివాసరావు, సునీతఎలిజబెత్(ముదిగొండ తహసిల్దారు) దంపతుల కొడుకైన సిద్ధుసిద్ధార్థ, హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేస్తూనే, భద్రాచలంలో ‘ఫార్ఛ్యూన్ ఫిట్ నెస్’ సంస్థలో ట్రైనర్స్ మిథున్, శరత్ ఇచ్చిన శిక్షణకు తోడు శ్రమించి ప్రతిభ పెంచుకున్నాడు. ఆ సంస్థ తరపున రామ్మోహన్ సహకారంతో పోటీలలో పాల్గొన్నాడు. మంచి ప్రతిభ ప్రదర్శించి, జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యాడు. ఆ యువకుడి ప్రతిభను పలువురు ప్రముఖులు, స్నేహితులు, బంధువులు ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.