Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTechnologyTelanganaWarangalWomen

ప్రజాపాలన విజయోత్సవాలు విజయవంతం చేయాలి

ప్రజాపాలన విజయోత్సవాలు విజయవంతం చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 18)

ప్రభుత్వమేర్పడిన తొలి ఏడాదిలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 19న వరంగల్ లో నిర్వహించనున్న వేడుకలకు జిల్లా నుంచి మహిళలను భాగస్వాములు చేసే ఏర్పాట్లపై కలెక్టర్ సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో పాటు ఎంపీడీవోలు, ఆర్టీసీ అధికారులు ఐకేపీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 19వ తేదీన వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి, ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుంచి 12 బస్సులలో బస్సుకు 45 మంది చొప్పున 540మంది మహిళలను కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. దూరంగా ఉన్న మండలాల బస్సులు ఉదయం 7 గంటలకు, మిగిలిన మండలాల బస్సులు 8గంటలకు మండలకేంద్రంలో బయలుదేరేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వరంగల్ కార్యక్రమంలో పాల్గొనే మహిళలందరికీ ఐడీ కార్డులు అందించాలని, ఐడీ కార్డు వెనుక సంబంధిత ఏపీఎంల ఫోన్ నెంబర్లు ఉండాలని అధికారులను సూచించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు ఏ ఇబ్బందులకు గురికాకుండా అన్నిఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బస్సుల్లో మహిళలకు తాగునీరు, టిఫిన్ ఏర్పాటు చేయాలన్నారు. బస్సులన్నీ ఒకే రూట్ ద్వారా వరంగల్ చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, బస్సులకు బ్యానర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళలకు నర్సంపేటలో మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనే మహిళలందరి వివరాలు, ఫోన్ నెంబర్లు కూడా నమోదు చేయాలన్నారు. అన్ని మండలాల్లో ఏపీఎంలు తమ పరిధిలోని ఉత్సాహవంతులైన మహిళా గ్రూపుల సభ్యులను గుర్తించి ఆ కార్యక్రమానికి తీసుకురావాలని చెప్పారు. మహిళలు కేవలం కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాకుండా అక్కడ వివిధ జిల్లాల మహిళలు, సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు చూడడం ద్వారా మన జిల్లాలో కూడా ఆలోచనలు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళల తరలింపునకవసరమైన బస్సుల వివరాలు అందించాలని ఆదేశించారు. అన్ని మండలాల ఏపీఎంలు, సీసీలు కార్యక్రమం అనంతరం మహిళలలెవరూ అక్కడే మిగిలిపోకుండా అందరినీ గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించారు. గమ్యస్థానం చేరుకునేంతవరకు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. మహిళలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

Related posts

కొత్తగూడెంలో పోలీసుశాఖ మెగా రక్తదాన శిబిరం

Divitimedia

దిష్టిబొమ్మ ఆధారంగా హత్య కేసు ఛేదించిన సీఐ

Divitimedia

ఐటీసీ-రోటరీక్లబ్ ఆధ్వర్యంలో నర్సులకు సన్మానం

Divitimedia

Leave a Comment