Divitimedia
DELHIHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelangana

ఏడాదికాలంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఏడాదికాలంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

వార్షికోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

✍️ హైదరాబాద్ – దివిటీ (నవంబరు 14)

తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఏడాదికాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో చేపట్ట బోతున్న “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం జరిగిన సమావేశంలో సీఎం సమీక్షించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఓవైపు సంక్షేమపథకాలు అమలు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున వాటన్నంటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్‌మెంట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. సచివాలయం ఆవరణలో డిసెంబర్ 9న సీఎం చేతుల మీదుగా జరిగే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్త విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తొలిఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు, కార్యక్రమాలపై శాఖలు, విభాగాల వారిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

అనాధలకు ఎం.ఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

Divitimedia

ఎన్.హెచ్.ఎం బకాయిలు విడుదల చేయాలని కోరిన సీఎం రేవంత్

Divitimedia

రేపే తొమ్మిది వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు  ప్రారంభోత్సవం

Divitimedia

Leave a Comment