Divitimedia
Bhadradri KothagudemEducationHealthKhammamLife StyleSportsSpot NewsTelanganaWomenYouth

ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 3)

భద్రాద్రి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న అండర్-17 బాల బాలికల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆనదఖనిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమైన ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తాము ఏ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వచ్చామనేది పక్కన పెట్టి గెలవాలనే కాంక్ష ఎక్కువగా ఉండాలని అప్పుడే విజయం సాధించగలరన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సైతం పాల్గొనడం వల్ల జీవితంలో చక్కగా స్థిరపడవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి తన వంతుగా కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం పట్ల జిల్లాకలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.
***
టీం ఛాంపియన్ షిప్ లో కాంస్యపతకం సాధించిన ఆతిథ్యజట్టు
***
ఆనందఖనిలో ఆరంభమైన 68వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్-17 బాల బాలికల టేబుల్ టెన్నిస్ పోటీల్లో టీం ఛాంపియన్ షిప్ విభాగంలో ఆదివారం ఆతిథ్య ఉమ్మడి ఖమ్మంజిల్లా బాలికల జట్టు తృతీయ స్థానం సాధించింది. టీం, ఛాంపియన్షిప్, వ్యక్తిగత విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర జట్టును ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ పోటీలలో బాలుర జట్టు సైతం అద్భుతమైన ప్రతిభ కనబరిచి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. బాలుర టీమ్ విభాగంలో నిజామాబాద్ జట్టు తృతీయ స్థానం సాధించింది. ఆదివారం సాయంత్రం వ్యక్తిగత పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వరా చారి ఎస్.జి.ఎఫ్ కార్యదర్శి నరేష్ కుమార్ తో పాటు ఈ పోటీల రాష్ట్ర పరిశీలకుడు మామిడి సంతోష్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు బట్టు ప్రేమ్ కుమార్, యనమదల వేణుగోపాల్, వి.వి.సాంబమూర్తి, లక్ష్మయ్య, శేఖర్, స్టెల్లా, రాము, కవిత, సీతాదేవి, సుజాత, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జూనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు

Divitimedia

రాష్ట్ర రాజధానిలో రాజకీయ వేడి

Divitimedia

నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి హామీలు

Divitimedia

Leave a Comment