Divitimedia
Bhadradri KothagudemEducationHealthLife StyleSpot NewsTelanganaWomen

బాలల స్నేహపూరిత జిల్లాగా మార్చాలి

బాలల స్నేహపూరిత జిల్లాగా మార్చాలి

ఐసీడీఎస్ అధికారులతో సమీక్షలో కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (అక్టోబరు 16

జిల్లాలో బాలకార్మికుల నిర్మూలన, బాలల భిక్షాటన, బాల్య వివాహాల నిర్మూలన కోసం సమన్వయంతో పని చేసి జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా మార్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు బుధవారం ఆయన మహిళా,శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లా పరిధిలో చేపడుతున్న ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్, అడాప్షన్, చైల్డ్ హెల్ప్ లైన్ కార్యక్రమాలు సమీక్షించారు. లోపపోషణకు గురైన పిల్లలను సాధారణస్థితికి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తాగునీటి వసతి, విద్యుత్తు, మరుగుదొడ్లు మొదలైన కనీసవసతులు కల్పించాలని ఆదేశీంచారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనూ మునగ, ఉసిరి, కరివేపాకు, చింత, వెలగ మొక్కలు తప్పనిసరిగా నాటాలని ఆదేశించారు. ఈ మొక్కలు నాటి వినియోగించడం ద్వారా విటమిన్ ఎ, సి, డి, క్యాల్షియం పుష్కలంగా వస్తాయని, దీనిద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ఇంకా అద్దెభవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల వివరాలు, స్థలం వివరాలు అందజేయాలని సీడీపీఓలను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఐసీడిఎస్ కార్యాలయాల నిర్మాణాలకు త్వరలోనే స్థలం కేటాయిస్తామన్నారు. జిల్లాలో బాలకార్మికుల నిర్మూలన, బాలల భిక్షాటన, బాల్యవివాహాల నిర్మూలన కోసం డీసీపీయు సమన్వయంతో పనిచేసి జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా మార్చాలన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో తమ పరిధిలో ఎంతమంది పిల్లలు, గర్భిణులున్నారో ఖచ్చితమైన వివరాలు నిర్దేశించిన పట్టికలో నమోదు చేయాలని ఆదేశించారు. ఖచ్చితమైన వివరాలిస్తేనే వారి ఆరోగ్యస్థితికనుగుణంగా వైద్యశాఖాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతలెనినా, సీపీడీఓలు, సిడబ్ల్యుసి సభ్యులు, డీసీపీయు, చైల్డ్ హెల్ప్ లైన్-1098 సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బూర్గంపాడులో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు

Divitimedia

మహిళాశక్తి భవనాలకు స్థలం పరిశీలించిన జిల్లా కలెక్టర్

Divitimedia

విజయదశమి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయశోభ

Divitimedia

Leave a Comment