ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుక
బీజేపీలో చేరిన బి.ఆర్.ఎస్ నాయకుడు బాలాజీ
✍️ బూర్గంపాడు – దివిటీ (సెప్టెంబరు 17)
సారపాకలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జీవీకే మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి తిరిగి బీజేపీలో చేరిన చుక్కపల్లి బాలాజీకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గుగులోత్ బాలునాయక్, జిల్లా నాయకుడు బిజ్జం శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు
బీరక సాయి శ్రీను, దుప్పటి సురేష్, వెలిశెట్టి రామారావు, గడ్డం సతీష్, రవినాయక్, కారం సాయి, కిరణ్, కోడెబోన రవి, భూక్య వెంకట్, బుద్ధ ధర్మరాజు, భూక్య నరేశ్, మేకల రామారావు, బిజ్జం వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.