19 నుంచి గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు
సద్వినియోగం చేసుకోవాలని కోరిన నిర్వాహకులు
✍️ ఖమ్మం – దివిటీ మీడియా (సెప్టెంబరు 3)
తెలంగాణ గ్రామ దేవాలయ అర్చక పరిషత్ సంస్థ ఆధ్వర్యంలో ఊ నెల 19వ తేది నుంచి 26వ తేది వరకు ‘గ్రామ దేవాలయ అర్చక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అనేక గ్రామాలలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలకు, గ్రామ దేవతలకు నిత్య పూజలనేవి జరగడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు పలు ప్రాంతాల్లో పూజారుల శిక్షణ తరగతులు నిర్వహించి, కనీస నిత్యపూజలు జరిగే విధంగా వారిని తయారు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమం ఆ గ్రామాల్లో మంచి ఫలితాలు ఇచ్చిందని, అదేవిధంగా ఈ ఏడాది కూడా పూజరుల శిక్షణ కార్యక్రమం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ శిక్షణ పొందాలనుకునేవారు కనీసం 5వ తరగతి, ఆపై చదివి ఉండాలని, లఘు పూజ విధానంలో ముద్రించి ఉన్న విషయాలు చదవగలగాలని వివరించారు. వయస్సు 18 సంవత్సరాల నుంచి 45సంవత్సరాల లోపు కలిగి ఉండాలని తెలిపారు. శిక్షణలో కూడాగా యోగా కూడా ఉంటుందని, 7రోజులపాటు పూర్తిగా శిక్షణ శిబిరంలో ఉండాలని స్పష్టం చేశారు. శిక్షణ మధ్యలో వెళ్ళేందుకు అనుమతి ఉండదని, పూర్తికాలం (7రోజులు) శిక్షణలో లేని వారికి ధృవపత్రాలు ఇవ్వడం జరగదని వారు వెల్లడించారు. శిక్షణా కాలంలో 7 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు కంచం, గ్లాసు వెంట తెచ్చుకోవాలని సూచించారు. పూజా సమయంలో ధరించడానికి అవసరమైన 2పంచలు, 2కండువాలు వెంట తెచ్చుకోవాలన్నారు. పూజకు వాడే ద్రవ్యాలు శిభిరంలో అందజేయబడతాయని, శిక్షణలో భాగంగా చెప్పిన విషయాలు రాసుకోవడానికి ఓ కలం,ఓ నోటు పుస్తకం తెచ్చుకోవాలని కోరారు. విలువైన వస్తువులు తీసుకరాకూడదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పాతబస్టాండ్ వద్దనున్న మాధురి ఫంక్షన్ హాలులో 19వ తేది మధ్యాహ్నం 1గంటకు ఆరంభమై, ఈ శిక్షణ 26వ తేది మధ్యాహ్నంతో పూర్తవుతుందని విభాగ్ ధర్మజాగరణ ప్రముఖ్ సోమయాజుల సాయి ప్రసాద్ శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంపై ఆసక్తిగల వారు సెల్ ఫోన్లు 9494498918, 9885187346, 9951625739, 9059063815, 9908879401, 9392497902, 9492908764 నెంబర్లలో ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని నిర్వాహకులు ఆ ప్రకటనలో కోరారు.