Divitimedia
Andhra PradeshDELHIHealthLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTravel And Tourism

రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు

రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు

ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి

✍️ విజయవాడ – దివిటీ (ఆగస్టు 24)

రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ, ఆమోదం తెలియజేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాల అభివృద్ధికి తొలి విడతగా రూ.15.4 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ నిధులతో గార్గేయపురం, కర్నూలు, కడప, వెలగాడ, నెల్లిమర్ల, చిత్తూరు డెయిరీ, చిత్తూరు, కలిగిరికొండ, కైలాసగిరి, శ్రీకాళహస్తి, ప్రకాశరావుపాలెం, తాడేపల్లిగూడెం, శ్రీకృష్ణదేవరాయకోట ఎకోపార్క్, పెనుకొండ, బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకోపార్క్, కదిరి, కాశీబుగ్గ, పలాస, ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్, విశాఖపట్నంలలో నగరవనాలను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖాధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 నగరవనాల అభివృద్ధికి వేగంగా పనులు సాగుతున్నాయనీ, రాబోయే 100 రోజుల్లోగా 30 నగర వనాల పనులు పూర్తికావస్తాయని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే అవకాశాలు లభించాయని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పచ్చదనం 50శాతం మేరకు ఉండాలని, ఆ దిశగా నగరవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఆగస్టు 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో ప్రజలను, ముఖ్యంగా యువత భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులకు పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహించాలని, ప్రభుత్వశాఖలతోపాటు అన్ని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పేపర్ మిల్లులు, అధ్యాత్మిక సంస్థలు, తదితరాలు అన్నింటినీ ఇందులో పాలుపంచుకొనేలా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Related posts

బాధ్యతలు చేపట్టిన రోటరీ ఇన్ భద్రా నూతన కార్యవర్గం

Divitimedia

రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు చేయాలి

Divitimedia

మహిళాశక్తి భవనాలకు స్థలం పరిశీలించిన జిల్లా కలెక్టర్

Divitimedia

Leave a Comment