Divitimedia
Spot News

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రుల హాట్ కామెంట్స్

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రుల హాట్ కామెంట్స్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 15)

సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఘాటైన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ తీరును విమర్శిస్తూ, తమ ప్రభుత్వ కృషిని వివరించారు. తుమ్మల మాట్లాడుతూ, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల హడావిడి ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం వచ్చారన్నారు. గత ప్రభుత్వం రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టారని, కానీ పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా సద్వినియోగం కోసం తమ ప్రభుత్వం పట్టుదలగా పనులు చేపట్టిందన్నారు.
యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తే సత్తుపల్లి ట్రంక్ కెనాలా పరిధిలో ఆయకట్టుకు గోదావరి జలాలు చేరతాయని వివరించారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తిచేస్తే పాలేరుకు కూడా గోదావరి జలాలు అందుతాయని వెల్లడించారు. రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ శ్రీరామచంద్రుడి పాదాల వద్ద ప్రకటన చేశారని, అది నిజం చేస్తూ వైరా సభలో ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్ నీళ్లు రాని పక్షంలో గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టుకు నీరందిచేలా 70 రోజుల తక్కువ సమయంలోనే వైరా లింక్ కెనాల్ పూర్తి చేశామని తుమ్మల వివరించారు.
ఓపక్క సాగుకు జీవంగా సాగునీరు మరోపక్క రైతుకు ఊతంగా రైతు రుణమాఫీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు సకాలంలో పనిచేస్తామన్నారు. తాము నీళ్లు చల్లుకోవడానికి రాలేదని, ప్రభుత్వం అంటే నిరంతర అభివృద్ధి ప్రక్రియని, చిల్లర మాటలతో చేసే రాజకీయాలకు విలువ లేదని విమర్శించారు. కేసీఆర్, హరీశ్ ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు.
‘మీరు కూడా వచ్చి నీళ్ళు చల్లుకోండి…’ అంటూ ఎద్దేవా చేశారు. తన రాజకీయ జీవిత కల సీతారామ ప్రాజెక్ట్ అని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
———————-
గత కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్…
———————–

గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి నీళ్లు తరలించే సీతారామ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పేటెంట్ అన్నారు. గత ప్రభుత్వం డీ.పీ.అర్ చూస్తే 39 శాతం మాత్రమే పనులు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కమీషన్ల కోసం మోటార్లు పెట్టారని, గత ప్రభుత్వం కుక్కగోతులు తవ్విందని, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వలేదని ఆరోపించారు. 80 వేల పుస్తకాలు చదివిన పెద్దాయన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో రిజర్వాయర్ నిర్మాణం చేయలేదన్నారు.
తన చేతుల మీద శంకుస్థాపన చేసిన రోళ్లపాడును గత ప్రభుత్వంలో పెద్దాయన పక్కన పెట్టారన్నారు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో సీతారామ ప్రాజెక్ట్ గురించే దుమారం రేగుతోంది.

Related posts

‘భద్రాచలం ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేటాయించండి…’

Divitimedia

ప్రభుత్వవిప్ శ్రీనివాస్ ను కలిసిన కార్మికనాయకులు

Divitimedia

సీఎం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో ట్రాఫిక్ మల్లింపులు

Divitimedia

Leave a Comment