Divitimedia
Bhadradri KothagudemDELHIHealthHyderabadLife StyleNational NewsSpot NewsTechnologyTelanganaWomen

భూగర్భజలాల పెంపుదలే లక్ష్యంగా జలశక్తి అభియాన్

భూగర్భజలాల పెంపుదలే లక్ష్యంగా జలశక్తి అభియాన్

‘క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్’ పకడ్బందీగా నిర్వహించాలి

జల్ శక్తి అభియాన్, జల్ జీవన మిషన్ కేంద్ర నోడల్ అధికారి ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 6)

భూగర్భజలాల పెంపుదలే లక్ష్యంగా అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ లో భాగంగా ‘క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ (వాననీటిని ఒడిసిపట్టు)’ పేరిట కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జల్ శక్తిఅభియాన్, జల్ జీవన్ మిషన్ కేంద్ర నోడల్ అధికారి ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్ కోరారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన ఐడీఓసీలో జలశక్తి అభియాన్-గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, జల్ శక్తి అభియాన్ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ విట్టల్ సహా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ జల్ శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలు గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషెన్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, ఇరిగేషన్, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, భూగర్భజలాలు, మహిళాసంఘాలు వంటి అంశాలపై కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం కేంద్ర ప్రతినిధులు మాట్లాడుతూ, క్యాచ్ ద రెయిన్ వెన్ ఇట్ ఫాల్స్ అంశం పై కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపారు . జిల్లాలో ఉన్న నీటి వనరులు, చెరువుల సరిహద్దుల్లో ఎలాంటి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో సామూహిక,వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణంతోపాటు, అటవీపునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. కలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటుచేసి జల్ శక్తి అభియాన్ ద్వారా క్యాచ్ ద రైన్ క్యాంపెయిన్ చేపట్టామన్నారు. గత 6 సంవత్సరాలలో జిల్లాలో భూగర్భజలమట్టం గణనీయంగా పెరుగిందని, వర్షపునీరు వృధా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన జల్ శక్తి అభియాన్ కేంద్రం తీరును కేంద్ర ప్రతినిథులు పరిశీలించి, రిజిస్టర్లు తనిఖీ చేశారు. జిల్లాలో వున్న నీటివనరులు, నీటి సరఫరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర అధికారులు కిన్నెరసాని ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్బంగా పాజెక్ట్ విస్తీర్ణం, నీటి నిల్వ, పాజెక్ట్ ద్వారా నీటిసరఫరా జరిగే ప్రాంతాల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర అధికారులు ములకలపల్లి మండలంలోని అంకిత మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్రసభ్యులు మాట్లాడుతూ నీటిపొదుపు మహిళల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. నీటిని పొదుపు చేయడానికి మహిళలు తీసుకుంటున్న జాగ్రతలు, చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంట్లో వర్షపునీటి సంరక్షణకు ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణా గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, ఉద్యానవన అధికారి సూర్యనారాయణ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అర్జున్ రావు, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

గణనాధుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి

Divitimedia

రాష్ట్రంలో ‘డ్రగ్స్’ నిరోధానికి ఉక్కుపాదం : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Divitimedia

ఏటీసీని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Divitimedia

Leave a Comment