మినీస్టేడియం త్వరగా అందుబాటులోకి తేవాలి: కలెక్టర్
✍️ పాల్వంచ – దివిటీ (ఆగస్టు 6)
పాల్వంచలో మినీస్టేడియం పనులు త్వరగా పూర్తిచేసి, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాల్వంచ శ్రీనివాసనగర్ కాలనీలో నిర్మాణంలోని మినీ స్టేడియం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణం పూర్తయ్యేలా అవసరమైన పెండింగ్ పనులపై పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం. పరంధామరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.ఈ మినీ స్టేడియం త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, అథ్లెటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం సహా పెండింగ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులకు సంబంధించిన బడ్జెట్ మంజూరుకు కూడా కలెక్టర్ హామీనిచ్చారు. ఈ సందర్భంగా స్టేడియంలోని ‘ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్’ ను కూడా సందర్శించిన కలెక్టర్ ట్రైనింగ్ వివరాలపై కోచ్ కళ్యాణ్ నుంచి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మున్సిపల్ కమీషనర్, తదితరులు పాల్గొన్నారు.