Divitimedia
EntertainmentInternational NewsNational NewsSportsYouth

ప్రపంచ క్రికెట్ లో నెంబర్-1 టీమిండియా…

ప్రపంచ క్రికెట్ లో నెంబర్-1 టీమిండియా…

టీ-20, వన్డే, టెస్ట్… అన్నిఫార్మాట్లలో మనదే జోరు…

హాట్ ఫేవరెట్ గా వన్డే ప్రపంచకప్ బరిలోకి…

✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం

మరికొన్ని రోజుల్లోనే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ ఆరంభం కాబోతున్న వేళ భారత్ జట్టు (టీమిండియా) అరుదైన ఘనత సాధించి, జేజేలు అందుకుంటోంది. ఇటీవలే ఆసియా కప్ కైవసం చేసుకుని మంచి ఊపుమీదున్న భారత్ తాజాగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచులోనూ విజయం సాధించి, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఉన్నత స్థానానికి చేరుకుంది. 116పాయింట్లతో టీం ఇండియా ప్రపంచ వన్డే క్రికెట్ ఫార్మాట్లో అగ్ర స్థానంలోకి చేరింది. కాగా పాకిస్థాన్-115 పాయింట్లతో రెండోస్థానం, ఆస్ట్రేలియా-111 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇప్పటికే టెస్టుతోపాటు, టీ-20 ఫార్మాట్లలో టీమిండియా టాప్ ప్లేసులో ఉంది. ఆసీస్ జట్టుతో బోర్డర్-గవాస్కర్ సిరీస్ గెలవడం, వరల్డ్ టెస్టుఛాంపియన్ షిప్ ఫైనల్ చేరడం, విండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడంతో 118 పాయింట్లతో టెస్టుల్లో కూడా అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా-118, ఇంగ్లండ్-115 పాయింట్ల తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జరిగిన టీ-20 ప్రపంచకప్ లో సెమీ ఫైనల్కు చేరుకోవడం, పలు ద్వైపాక్షిక సిరీసులలోనూ మంచి ప్రతిభ చూపడంతో టీ-20 ఫార్మాట్ లోను టీమిండియా ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. టీ-20 ప్రపంచకప్, 2021 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 టీ- 20 సిరీస్ లలో ఆడిన టీమిండియా, ఒక్క సిరీస్ మాత్రమే చేజార్చుకుంది. ఈ ప్రతిభ వల్ల టీమిండియా ఖాతాలో 264పాయింట్లు చేరాయి. దీంతో టీ-20 ఫార్మాట్ లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ఇంగ్లండ్, పాకిస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఐబీపీఓ, క్లర్కు పరీక్షలకు శిక్షణకై దరఖాస్తు చేసుకోండి : ఐటీడీఏ పీఓ

Divitimedia

రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు

Divitimedia

ఐటీసీ అనారోగ్య కాంట్రాక్టు కార్మికుడికి తోటివారి చేయూత

Divitimedia

Leave a Comment