గ్రీన్ భద్రాద్రి నూతన అధ్యక్షుడిగా ఉమాశంకర్ నాయుడు ఏకగ్రీవ ఎంపిక
✍️ భద్రాచలం – దివిటీ (జులై 24)
గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ నూతన అధ్యక్షుడిగా అంకిశెట్టి ఉమా శంకర్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా పామరాజు తిరుమలరావు, కోశాధికారిగా లకావత్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా ఆర్.రామకృష్ణారెడ్డి, మహిళా కార్యదర్శిగా పూసం రవికుమారి, తదితరులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఏగి సూర్యనారాయణ స్వగృహంలో బుధవారం జరిగిన గ్రీన్ భద్రాద్రి సర్వసభ్యసమావేశంలో ఈ మేరకు 2024 – 25 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, భవిష్యత్తులో గ్రీన్ భద్రాద్రి పేరు ప్రతిష్టలు పెంచేవిధంగా కార్యక్రమాలు చేపట్టాలని, మొక్కలు అధికశాతం నాటి, పచ్చదనానికి కృషి చేయాలని నూతన కమిటీకి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ మాజీ అధ్యక్షుడు బెల్లంకొండ రాంబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీరంగం సంపత్, కోశాధికారి విష్ణుమొలకల సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ భద్రాచలం అధ్యక్షుడు రామలింగేశ్వరరావు, గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బొలిశెట్టి రంగారావు, జి.రాజారెడ్డి, కె.అబ్రహాం, సోమరౌతు శ్రీనివాసరావు, ఏగి సూర్యనారాయణ, కామిశెట్టి కృష్ణార్జునరావు, పచ్చినీలం మునికేశవ్, కట్టా నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.