బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 20)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిగా శ్రీరామ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిగా ఇప్పటివరకు పని చేసిన ఆయన తాజాగా బదిలీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారిగా వచ్చారు. ఈ మేరకు ఇప్పటివరకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించిన వేల్పుల విజేత నుంచి, శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణానికి చెందిన శ్రీరామ్, ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, 2017లో గ్రూప్1 పరీక్ష ద్వారా అధికారిగా ఎంపికయ్యారు. ఆయన మొదట ఖమ్మం జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిగా చేరి ఇప్పటి వరకు అక్కడే పనిచేశారు. తాజాగా బదిలీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చారు.