Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTechnologyTelanganaYouth

వరదలపై 18న బూర్గంపాడులో ఎన్డీఆర్ఎఫ్ సదస్సు

వరదలపై 18న బూర్గంపాడులో ఎన్డీఆర్ఎఫ్ సదస్సు

✍️ బూర్గంపాడు – దివిటీ (జులై 16)

గోదావరి వరదల ముందు జాగ్రత్తలలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఎన్.డి.ఆర్.ఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన బూర్గంపాడులో కమ్యూనిటీ అవగాహన, సంసిద్ధత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ ముజాహిద్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9గంటలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించ బోతున్నట్లు ఆయన వివరించారు. ఉరుములు, మెరుపులు, దుమ్ము, వడగళ్ల వాన, కుంభవృష్టి, బలమైన గాలుల నివారణ, నిర్వహణపై చేయవలసిన, చేయకూడనివి వంటి అంశాలపై ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం సభ్యులు అవగాహన కల్పిస్తారని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమనికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ), జిల్లా అధికారులు హాజరవుతారని ఆయన తెలియజేశారు. మండల అధికారులతోపాటు ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని, వరదజాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు.

Related posts

విలువిద్య పోటీల్లో జాతీయస్థాయికి ఎంపికైన మమత

Divitimedia

డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

Divitimedia

అక్టోబరు 3, 4 తేదీల్లో జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు

Divitimedia

Leave a Comment