ప్రభుత్వవిప్ శ్రీనివాస్ ను కలిసిన కార్మికనాయకులు
✍️ సారపాక – దివిటీ (జులై 9)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం భద్రాచలం పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఐటీసీ కార్మిక సంఘాల నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను సీనియర్ కార్మికనేత గోనె దారూగ, ఐటీసీ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గోనె రామారావు ఆధ్వర్యంలో కార్మికసంఘ నాయకులు కలిసి పలు కార్మిక సమస్యలు, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మిక నాయకులు గోనె దారూగ, గోనె రామారావుతోపాటు డి.ఆర్.రావు, వీరభద్రరావు, కె.వి.రమణ, అంకబాబు, సాయి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.