Divitimedia
Spot News

లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు

లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాచలం – దివిటీ (జులై 6)

రాబోయే వర్షాల దృష్ట్యా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టాన్ని పరిశీలిస్తూ పెరిగే క్రమంలో లోతట్టుప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులకు సూచించారు. భద్రాచలం కూనవరంరోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట నిర్మాణపనులను పరిశీలించారు. అధిక వర్షాల వల్ల వరదలు సంభవిస్తే, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా భద్రాచలం పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు, రికార్డులను తనిఖీ చేశారు. ఆ పోలీస్ స్టేషన్ లో నమోదైన పలు కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గంజాయి రవాణా, గుట్కా, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా భాద్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్, సీఐ సంజీవరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ట్రాఫిక్ ఎస్సై మధుప్రసాద్, ఎస్సై విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పంచమని చెప్తే… వృధాగా పడేశారు…

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Divitimedia

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా శ్రీనివాసరెడ్డి నియామకం

Divitimedia

Leave a Comment