నేడు జిల్లాకు రానున్న ఎంపీ రఘురాంరెడ్డి
ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ఖమ్మం
✍️ ఖమ్మం – దివిటీ (జులై 6)
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. 18వ లోక్ సభలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారo చేసిన తర్వాత జూన్ 24 నుంచి జరిగిన తొలి విడత పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొన్న ఆయన తొలిసారి ఖమ్మం వస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 11గంటలకు కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి వెళతారు. తనకు భారీ విజయానికి సహకరించిన పార్టీ పెద్దలు, శ్రేణులకు కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారు. 11:30గంటల నుంచి ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని తన బ్లూసీ విల్లా నివాసంలో అందుబాటులో ఉంటారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీని వ్యక్తిగతంగా కలిసేందుకు అందుబాటులో ఉంటారు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని ఎంపీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.