Divitimedia
HealthHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

నూతన వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

✍️ హైద‌రాబాదు – దివిటీ (జులై 2)

తెలంగాణలో సహాయనిధి(సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులు  ఇక నుంచి ఆన్ లైన్ లోనే స్వీకరించనున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) నిధులు పక్కదారి పట్టే అవకాశం లేకుండా పారదర్శకతతో నిధులు మంజూరు చేయాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన రాష్ట్ర నూతన వెబ్ సైట్ ను సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానం రూపొందించామని, ఇక ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు అప్లోడ్ చేసింతర్వాత  సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారని, ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను కూడా   సచివాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఆ   అప్లికేషన్ ఆన్ లైన్ ద్వారా సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారని, అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ ను ఆమోదించి చెక్ ను సిద్ధం చేస్తారన్నారు. చెక్ పై తప్పనిసరిగా సంబంధిత దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ను ముద్రిస్తారని, దీని వల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదనంనారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్ లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తాని వివరించారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారని, https/cmrf.telangana.gov.in\ సైట్ లో దరఖాస్తు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Related posts

హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

Divitimedia

మణుగూరులో పొలిటికల్ హీట్ ; హోర్డింగుల ధ్వంసం వివాదం

Divitimedia

ఎన్నికల ప్రక్రియపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓ

Divitimedia

Leave a Comment