తెలంగాణలో 20 మంది ఐఏఎస్ ల బదిలీ..
✍️ హైదరాబాదు – దివిటీ మీడియా (జూన్ 15)
ఎన్నికల హడావుడి ముగియడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన కారణాలతో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు 20 మంది అధికారులను బదిలీ చేస్తూ శనివారం జీఓ విడుదల చేసింది. బదిలీ అయిన వారిలో అత్యధికంగా జిల్లాల కలెక్టర్లు ఉండటం గమనార్హం.
ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్యను బదిలీ చేశారు. జగిత్యాల కలెక్టర్ గా సత్య ప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర బోయి, మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్ గా ప్రతిక్ జైన్ ను బదిలీ చేశారు. నల్గొండ కలెక్టర్ గా నారాయణరెడ్డి, వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్, వరంగల్ కలెక్టర్ గా సత్యశారదాదేవి, ములుగు కలెక్టర్ గా టీఎస్ దివాకరా, నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్ బదిలీ అయ్యారు.