గ్రామపంచాయతీ ట్రాక్టర్ పల్టీ, కార్మికుడికి తీవ్ర గాయాలు
✍️ బూర్గంపాడు – దివిటీ మీడియా (జూన్ 15)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామపంచాయతీకి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం పల్టీ కొట్టడంతో ఓ కార్మికుడు తీవ్రగాయాలపాబయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం స్థానిక భాస్కర్ నగర్ లో చెత్త తీసేందుకు వెళ్లిన సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టినట్లు చెప్తున్నారు. ఈ సంఘటనలో రవి అనే కార్మికుడికి తీవ్రగాయాలు కావడంతో సహచరులు, ఆ ప్రాంతవాసులు ఆసుపత్రికి తరలించారు. సారపాకలో పారిశుద్ద్య పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.